తమిళ స్టార్ హీరో కార్తి (Karthi), అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జపాన్ ( J apan). రాజు మురుగన్(Raju Murugan) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కార్తికి 25వ మూవీగా వస్తోంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్, రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ (జపాన్).. ఓ దొంగ పాత్రను పోషించారు. కార్తి లుక్స్, డైలాగ్ చెప్పే మ్యానరిజం అదిరిపోయింది.
ట్రైలర్ విషయానికి వస్తే.. సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తీ) తన చిన్నప్పుడే తల్లి కోసం దొంగగా మారడం వంటి సీన్స్ తో ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. కార్తి తనదైన యాసలో డైలాగ్ చెబుతూ..'బుల్లి చేప.. అమ్మ చేప కోసం ఓ కన్నెం వేసింది. అక్కడ మొదలైంది బుల్లి చేప వేట' అంటూ కార్తీ వాయిస్ ఓవర్‌తో ఇంటెన్స్ క్రియేట్ చేయగా..చిన్నప్పుడే దొంగగా మారిన జపాన్.. ఆ తర్వాత ఏకంగా గజదొంగ అవుతాడు.
అపుడు 'ఆ బుల్లి చేప తిమింగలం అయింది' అనే డైలాగ్‌తో తనని తానే ఎలివేట్ చేసుకునే టైములో చూపించిన సీన్స్ ఆసక్తిగా ఉన్నాయి. కార్తి, హీరోయిన్ అను ఇమ్యున్యుయేల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకున్నాయి. చేయని పెద్ద నేరానికి జపాన్ ను ఇరికించడం కోసం చేసే ప్రయాత్నాలు ఇంటెన్స్ గా సాగుతుంటాయి. 'సొరచేపలు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ప్లాన్‍లు వేసినా తిమింగలం వలలో పడదుగా' , 'సింహం కాస్త సిక్ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిపెట్టాయట.' అంటూ జపాన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. దీంతో ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు మేకర్స్. 2023 దీపావళికి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. జపాన్ లో సునీల్ కీలక పాత్ర పోషిస్తుండగా..జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ చిత్రంతో నటుడిగా కనిపించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.