
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్సామర్థ్యాన్ని పెంచాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మేయర్ గ్రేటర్ పరిధిలోని ప్రాసెసింగ్ యూనిట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోకో పిట్ యూనిట్ నిర్వహణ ద్వారా 10 మంది ఎస్ హెచ్ జీ మహిళలు ఉపాధి పొందుతున్నారని, ఈ యూనిట్ ను బలోపేతం చేయడానికి వరంగల్ లో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం కోకోపిట్ యూనిట్ కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లను మేయర్ పరిశీలించారు. డీఆర్ సీసీ కేంద్రానికి ప్రతిరోజు ఒక టన్ను పొడి చెత్త చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. బయో మిథనైజేషన్ ప్లాంట్ ను వెంటనే మరమ్మతులు చేసి నిర్వహణలోకి తీసుకోవాలని సీఎంహెచ్ వోను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ వో డా.రాజారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.