- బూటకపు హామీలతో ఓట్లు దండుకున్నరు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: బూటకపు హామీలతో యువతను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. యువకులకు, స్టూడెంట్లకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శుక్రవారం ఆమె తన నివాసంలో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన జాగృతి నాయకులతో సమావేశమయ్యారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని నిలదీశారు. కాగా, వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్తో చనిపోయిన శైలజ కుటుంబానికి రూ.2 లక్షల పరిహారాన్ని ఆమె ప్రకటించారు. వెలమ కులాన్ని కించపరుస్తూ షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను డిమాండ్ చేశారు.