ఎన్నికలు వచ్చాయి కాబట్టే... కేసీఆర్ కొత్త నాటకం : మంత్రి జూపల్లి

కేసీఆర్ కొత్త నాటకానికి తెర తీశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కృష్ణా జలాలపై మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమం చేస్తామని బీరాలు పలికారని, తప్పు చేసిన వారే భయపడుతారని అన్నారు. గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణాలో నీటి వాటా కోసం కనీసం కేంద్రాన్ని అడగలేదు హక్కుల కోసం డిమాండ్ చేయలేదని చెప్పారు. 69 శాతం పరివాహక ప్రాతం ఉన్నా నీటి వాటా సాదించలేదని కేటాహించిన నీటిని కూడా వాడుకోలేదని విమర్శించారు. 

ALSO READ :- అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు

కృష్ణా జలాల గురించి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేయలేదు కేంద్రాన్ని కోరలేదని జూపల్లి అన్నారు. అప్పుడు ఉద్యమం చేయలేదని పైగా సుప్రీంకోర్టులో ఉన్న ఒక్క కేసును ఉపసంహరించుకున్నారని అన్నారు. హామీ ఇవ్వకుండానే విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్ట్ కట్టడానికి సహకారించారని అన్నారు.  ఏపీకి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరిగాయని మంత్రి ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు.