నేడు తెలంగాణ భవన్​కు మాజీ సీఎం కేసీఆర్​!

నేడు తెలంగాణ భవన్​కు  మాజీ సీఎం కేసీఆర్​!
  • బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేడర్​కు దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్​కు రానున్నారు. బుధవారం తెలంగాణ భవన్​లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాల వంటి వాటిపై పార్టీ కేడర్​కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ బయటకు రాకపోతుండడంతో కేడర్​లో కొంత నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న విస్తృత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది.