హైదరాబాద్: ప్రవేట్ హాస్పిటల్స్ కి ధీటుగా సర్కార్ ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పే సీఎం కేసీఆర్ .. జ్వరమొస్తే ఎందుకు ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ లో వైద్యం చేయించికోరని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి. ఆదివారం ఆమె హైదరాబాద్ లో జరిగిన ప్రజారోగ్య పరిరక్షణ సభలో పాల్గొని మాట్లాడారు. "ప్రభుత్వ వైద్యశాలలో రిక్రూట్ మెంట్ లేదు, మౌలిక సదుపాయాలు వేవు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక ప్రజారోగ్యం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వైద్యారోగ్య శాఖలో ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పదిహేను వేల ఉద్యోగాలే భర్తీ చేస్తామన్నారు. ట్రీమ్స్ హాస్పిటల్ లో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. నాలుగు గ్రామ పంచాయితీలకు ఒక పీహెచ్ సీ ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం మాకేం ఇస్తలేదు అని.. అంటున్నారు. ఎన్ ఆర్ హెచ్ ఎం కింద రూరల్ హెల్త్ కేర్ కింద ప్రతి సంవత్సరం కేంద్రం డబ్బులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రజారొగ్యం కింద వేల కోట్లు మంజూరు చేసింది. వాటిని సరైన పద్దతిలో వినియోగించుకోవడంలేదు. నర్సింహపేట్, పరకాలలో హాస్పిటల్ కి నిధులు ఎన్ ఆర్ హెచ్ ఎం కింద కేంద్రం ఇచ్చింది. ఆశ వర్కర్ జీతం, అంబిలెన్స్ లకు కేంద్రం కదా పైసలు ఇచ్చేది. 150 మేడకల్ కాలేజీలు కేంద్రం సాక్షాన్ చేస్తే.. ఎందుకు అప్లై చేయలేదు. తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు జై సమాఖ్య ఆంధ్ర అని నినాదలు చేసిన వ్యక్తి డీఎంఈ రమేష్ రెడ్డిని వీళ్ళ అందరిమీద కుసబెట్టిండు. ప్రజల పక్షాన.. డీఎంహెచ్, డీఎంఈని మార్చండి. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కట్టించండి. ప్రభుత్వం హాస్పిటల్స్ పట్టించుకోవాలి. వాటికీ మంచి బిల్డింగ్స్, ఎక్విప్మెంట్ ఉండేలా చూసుకోవాలి. ఎస్ పీఎఫ్ భద్రత కల్పించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నిధులు శ్రీనివాస్ రావు దుర్వినియోగం చేస్తున్నారు. వెంటనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావును భర్తరఫ్ చెయ్యాలి. ప్రైవేట్ హాస్పటల్ కు ధీటుగా ప్రభుత్వ హాస్పటల్ కు నిధులు మంజూరు చేసి అభివృద్ది చెయ్యాలి" అని డిమాండ్ చేశారు రాణి రుద్రమరెడ్డి.