డిసెంబర్ 19, 2023 న దుబాయ్‌లో ఐపీఎల్ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా వేలం కోసం నిన్న(డిసెంబర్ 11) రిజిస్టర్ అయిన 1166 మంది ప్లేయర్ల నుంచి ఫ్రాంచైజీలు 333 మంది క్రికెటర్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సోమవారం షార్ట్ లిస్ట్ చేసింది. 2 కోట్ల బేస్ ప్రైజ్ లిస్టులో కేవలం ముగ్గురు భారత క్రికెటర్లు మాత్రమే ఉన్నారు.
ఇండియా పేసర్లు శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్ ఐపీఎల్ 2024 వేలంలో అత్యధికంగా రూ. రెండు కోట్ల బేస్‌ప్రైజ్‌లో బరిలో నిలిచారు. అయితే ఈ లిస్టులో కేదార్ జాదవ్ పేరును ఫ్రాంచైజీలు పక్కన పెట్టేసి ఈ మాజీ భారత ఆటగాడికి షాకిచ్చారు. కేదార్ జాదవ్ 2 కోట్ల బేస్ ధరతో వేలం కోసం నమోదు చేసుకున్నాడు. అయితే ఫ్రాంచైజీలు ఈ ఆటగాడిపై ఆసక్తి చూపించలేదు.
2019 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటి నుంచి ఈ బ్యాటర్ కు డిమాండ్ బాగా తగ్గింది. జాదవ్ గత ఏడాది జరిగిన వేలంలో అమ్ముడుపోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు (RCB) డేవిడ్ విల్లీ సీజన్ మధ్యలో గాయపడడంతో జాదవ్ ను ఆర్సీబీ జట్టులో చేర్చుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా రెండు మ్యాచ్‌లు ఆడి 12 పరుగులు మాత్రమే చేశాడు.
మహారాష్ట్రకు చెందిన జాదవ్ ఐపీఎల్ లో మొత్తం 95 మ్యాచ్ లు ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 123.14 స్ట్రైక్ రేట్‌తో 1208 పరుగులు చేసిన జాదవ్ ఇకపై ఐపీఎల్ లో కనిపించకపోవచ్చనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్‌లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. అయితే ఈ ముగ్గురూ వేలంలో ఎవరు అమ్ముడవుతారనేది ఆసక్తికరంగా మారింది. వేలం కోసం షార్ట్‌లిస్ట్ చేయని INR 2 కోట్ల బేస్ ధర కలిగిన విదేశీ ఆటగాళ్లలో ఏంజెలో మాథ్యూస్, టామ్ బాంటన్ ఉన్నారు. రెండు కోట్ల బేస్‌ప్రైజ్‌లో మొత్తం 23 మంది ఆటగాళ్లు ఉండగా, రూ. 1.5 కోట్ల ధరతో 13 మంది ఆటగాళ్లు వేలం తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Ex CSK Player Kedar Jadhav Name Not Shortlisted for IPL 2024 Auction. His base price 2cr. pic.twitter.com/wGsbslOC1p
— Ruturaj Gaikwad fc (@Pradeep20497691) December 12, 2023