Good Health : పుచ్చకాయలు కొంటున్నారా.. మంచిదా కాదా అనేది ఇలా తెలుసుకోండి..!

Good Health : పుచ్చకాయలు కొంటున్నారా.. మంచిదా కాదా అనేది ఇలా తెలుసుకోండి..!

సమ్మర్ మొదలైంది. ప్రారంభంలోనే ఎండలు ఘోరంగా మండుతున్నాయి. అలా బయటకు వెళ్లి వస్తే బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతోంది. నీళ్లు ఎన్ని తాగినా ఆ ఫీలింగ్ ఉండదు. ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంటుంది. దాదాపు సమ్మర్ లో అందరు ఇలాగే ఫీలవుతుంటారు. సూరన్న అంతలా మండుతున్నాడు మరి. ఇలాంటి సమయంలోనే అందరికీ గుర్తొచ్చే కామన్ ఫ్రూట్.. పుచ్చకాయ. అలసి పోయి వచ్చి అలా సోఫాలో కూర్చొని నాలుగైదు పుచ్చకాయ ముక్కలు తింటే.. ఆ మజా వేరు. అయితే సమ్మర్ అందరూ ప్రిఫర్ చేసే పుచ్చకాయ కొనేముందు ఈ టిప్స్ పాటిస్తే కోయకుండానే ఎర్రని గుజ్జుతో.. స్వీట్ స్వీట్ గా ఉండే వాటర్ మిలాన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. 

గుండ్రంగా ఉండాలా లేదా ఎగ్ ఆకారంలో ఉండాలా.. ఏది బెటర్:

మంచి పుచ్చకాయ కొనడం తెలియకపోతే టేస్ట్ గా ఉండేది కావాలనుకుంటే దాని ఆకారాన్ని బట్టి కొనండి. రౌండ్ గా ఉన్నది లేదా ఓవల్ షేప్ లో అంటే రౌండ్ గా ఉంటూ పొడవుగా (ఎగ్ లా ) ఉన్నవి ఎక్కువగా అందుబాటులో ఉంటుంటాయి. ఈ రెండింటిలో రౌడ్ షేప్ లో ఉన్నది బెటర్ చాయిస్. 

రౌండ్ షేప్ లో ఉన్నది స్వీట్ గా ఉంటుంది. ఓవల్ షేప్ లో ఉన్న కాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ ఎక్కువగా ఉంటే స్వీట్ నెస్ తక్కువగా ఉంటుంది. 

పసుపు మచ్చలు ఉన్నాయో లేదో చూడండి:

పుచ్చకాయ తోలుపైన పసుపు పచ్చటి మచ్చలు ఉంటే వాటిని తీసుకోండి. ఎందుకంటే ఎల్లో స్పాట్స్ ఉండే వాటర్ మిలాన్స్ స్వీట్ గా ఉంటాయి. ఎల్లో మచ్చలు వస్తే అది బాగా పండిందని గుర్తు పెట్టుకోండి

మెష్ మార్కింగ్స్ ఉన్నాయేమో చూడండి:

పుచ్చకాయపై మెష్ మార్కింగ్స్ ఏర్పడతాయి. అంటే వల ఆకారం. వీటినే వెబ్ స్పాట్స్ అంటుంటారు. ఈ లైన్స్ దగ్గర దగ్గరగా ఉంటే అది బాగా తియ్యగా ఉంటుంది. ఒకవేళ దూరంగా ఉంటే అంత స్వీట్ గా ఉండదని గుర్తుపెట్టుకోండి. 

బరువు ఆధారంగా స్వీట్ గా ఉందో లేదో చెప్పొచ్చు:

వాటర్ మిలాన్ కట్ చేయకుండా స్వీట్ గా, పండినదా లేదా చెప్పాలంటే బరువును బట్టి చెప్పొచ్చు. పుచ్చకాయలో 90 శాతం నీరే ఉంటుంది కాబట్టి.. ఎక్కువ బరువు ఉంటే అది బాగా పండినదిగా, తియ్యనిదిగా గుర్తించవచ్చు.

వేలితో కొట్టి కూడా గుర్తించవచ్చు:

వాటర్ మిలాన్ పండినదో లేదో వేలితో టచ్ చేసి చెప్పవచ్చు. స్వీట్ గా ఉందో లేదో సింపుల్ గా కనిపెట్టవచ్చు. వేలితో లేదా గోళ్లతో ఇలా రెండు సార్లు టచ్ చేయండి. వెదురు బొంగు వచ్చినట్లుగా ఎక్కువ సౌండ్ వచ్చినా.. లేదా తక్కువ సౌండ్ వచ్చినా పండు సరిగా లేదని అర్థం. అలా కాకుండా లోపలి నుంచి ఒక్కసారి టచ్ చేస్తే.. తరంగం మాదిరిగా రెసొనేటింగ్ సౌండ్.. అంటే వైబ్రేషన్ వచ్చినట్లు ఉంటే అది తియ్యగా ఉంటుందని గుర్తించుకోవాలి. 

ఈ టిప్స్ తో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏది పడితే అది తీసుకుని ఇంటివచ్చి.. అరే పండు స్వీట్ గా లేదే.. అనుకునే బదులు ఈ టిప్స్ పాటించి మంచి వాటర్ మిలాన్ ను సెలెక్ట్ చేసుకోండి.