
హైదరాబాద్ : నటి కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి టీఆర్‌ఎస్ నాయకుడు కేశ్ పల్లి (గడ్డం) ఆనందరెడ్డి(60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గుండెనొప్పితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట్ లో అడ్మిట్ అయిన కొంత సమయానికే ఆనందరెడ్డి చనిపోయారని డాక్టర్లు తెలిపారు. ఆనందరెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి తనయుడు. మొదట యూత్ లీడర్ గా పని చేసిన ఆనంద్ రెడ్డి.. 2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అందులో ఒకరు కీర్తిరెడ్డి. పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమాలో నటించిన నటి కీర్తి రెడ్డి..సుమంత్ ను పెళ్లాడి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.