తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది కీర్తి సురేష్. ఇప్పుడు నార్త్‌లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది కీర్తి. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘రఘు తాత’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘బేబీ జాన్’ మూవీ విశేషాలను కూడా షేర్ చేసుకుంది. తమిళ హీరో విజయ్ నటించిన ‘తేరీ’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ ధావన్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.
ఈ సినిమా గురించి కీర్తి మాట్లాడుతూ ‘‘తేరీ’లో హీరోయిన్‌గా నటించిన సమంత.. ఆ పాత్రలో ఒదిగిపోయారు. సాధారణంగా నాకు రీమేక్ మూవీస్ చేయాలంటే భయం ఉండేది. కానీ ‘బేబీ జాన్’లో యాక్ట్ చేయడానికి ఏ మాత్రం భయపడటం లేదు. ఎందుకంటే ఇందులో హీరోయిన్ పాత్రను చాలా అద్భుతంగా రాశారు దర్శకుడు కాలీస్. ఈ సినిమా అవుట్‌పుట్ బాగా వస్తోంది.
క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంతో బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది’ అని చెప్పింది. మరోవైపు సుహాస్‌కు జంటగా కీర్తి సురేష్ ఓ వెబ్ ఫిల్మ్‌లో నటిస్తోంది. ‘ఉప్పు కప్పురంబు’ టైటిల్‌తో ఐవీ శశి దర్శకుడిగా రాధిక లావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా పూర్తయింది. అమెజాన్ ప్రైమ్‌లో ఇది విడుదల కానుంది.