0007 నెంబర్‌కు రూ.46 లక్షలు : లంబోర్గిని కారు అంటే మాటలా ఏంటీ..!

0007 నెంబర్‌కు రూ.46 లక్షలు : లంబోర్గిని కారు అంటే మాటలా ఏంటీ..!

Kerala News: ఈరోజుల్లో లగ్జరీ కార్ ఓనర్లు తమకు నచ్చిన కారుతో పాటు దానికి ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం కూడా భారీగానే డబ్బు వెచ్చిస్తున్నారు. కార్ల ధర కోట్లలో ఉంటే వాటి నంబర్ ప్లేట్ల రేటు కూడా అదే స్థాయిలో లక్షల్లో పలుకుతున్నాయి. దుబాయ్ లాంటి దేశాల్లో ఇది సర్వసాధారణంగా కనిపించే అంశమే అయినప్పటికీ కేరళలో ఒక కంపెనీ యజమాని తన లాంబోర్గిని కారు నంబర్ ప్లేట్ కోసం ఖర్చు చేసిన సొమ్ము ప్రస్తుతం చాలా మందికి కళ్లు తిరిగేలా చేస్తోంది.

అవుండి బాబు.. కొచ్చికి చెందిన లిట్మస్ 7 సిస్టమ్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈవో, వ్యవస్థాపకుడు వేణు గోపాలకృష్ణన్ పేరు ప్రస్తుతం వార్తల్లో సంచలనంగా మారింది. రూ.4 కోట్లు విలువైన లాంబోర్గిని ఉరుస్ కారును కొనుగోలు చేసిన ఆయన తనకు ఎంతగానో నచ్చిన ‘KL 07 DG 0007’ నంబరు ప్లేటును సొంతం చేసుకునేందుకు ఆన్ లైన్ వేలం పాటలో రూ.46 లక్షలు వెచ్చించారు. 

 

ఏప్రిల్ 7, 2025న కేరళ మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన వేలపాటతో ఈ నంబరు ఆరంభ ధర రూ.25వేల నుంచి స్టార్ట్ కాగా నంబరును దక్కించుకోవటానికి దాదాపు ఐదుగురు పోటీపడ్డారు. అయితే చివరికి అధిక ధర చెల్లించటానికి ముందుకొచ్చిన గోపాలకృష్ణన్ దీనిని సొంతం చేసుకోవటం గమనార్హం.

►ALSO READ | IT News: టీసీఎస్ నుంచి టెక్కీలకు రెండు శుభవార్తలు..! భయం వద్దన్న సీఈవో..

కేరళలో మెుట్టమెుదటి లాంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మాంటే కారును ప్రస్తుతం గోపాలకృష్ణన్ మాత్రమే కలిగి ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇంకా ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. వీటిలో లాంబోర్గిని హురాకాన్ స్టెరాటో, బీఎండబ్ల్యూ M1000 XR బైక్‌ కూడా ఉండటం గమనార్హం. అలాగే అధికారులు నిర్వహించిన మరో వేలంలో ‘KL 07 DG 0001’ నంబరు ప్లేట్ రూ.25 లక్షల 52 వేల ధర పలికింది.