ఆ లాటరీ అమ్మితే రూపాయి లాభం వచ్చేది.. అయినా ఎవరూ కొనలేదు.. దీంతో డ్రా టైంకి మిగిలిపోయిన లాటరీలను పడేశాడు ఆ వ్యాపారి. డ్రా నెంబర్ అనౌన్స్ చేసిన తర్వాత.. చెక్ చేసుకుంటే.. మిగిలిపోయాయి అని పక్కన పడేసిన లాటరీకి కోటి రూపాయల బహుమతి తగిలింది. దీంతో ఈ విషయం వైరల్ అయ్యింది. అదృష్టాన్ని ఎవడూ ఆపలేడు.. మనది అని రాసిపెట్టి ఉంటే ఎలాగైనా మనకు వచ్చి తీరుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని కోజికోడ్కు చెందిన ఎన్ కే గంగాధరన్ ప్రభుత్వ 50 50 లాటరీలో లాటరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. అథోలి గ్రామంలో గంగాధరన్ కు దేవికా పేరు మీద ఓ స్టోర్ ఉంది. ఈ స్టోర్ ద్వారా గంగాధరన్ లాటరీ టికెట్లు విక్రయిస్తున్నాడు. అయితే అక్టోబర్ నెల ప్రారంభంలో గంగాధరన్ కొన్ని లాటరీ టికెట్లు అమ్మాడు. తన దగ్గర ఉన్న లాటరీ టికెట్లలో కొన్ని అమ్ముడుపోలేదు. అయ్యో లాటరీ టికెట్లు అమ్ముడుపోలేదని బాధపడ్డాడు. చేసేదేమి లేక అమ్ముడుపోని లాటరీ టికెట్ ను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఈ అమ్ముడుపోని లాటరీ టికెట్లే ఆయనకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. మిగిలిపోయి లాటరీ టికెట్లలో ఓ టికెట్ కు ఏకంగా కోటి రూపాయల లాటరీ తగిలింది.
ALSO READ : బస్సు యాత్రలతో ఏపీ ఎన్నికల శంఖారావం : సీఎం జగన్
తన దగ్గర లాటరీ టికెట్లలో ఏ లాటరీకి కోటి రూపాయలు దక్కిందో అని గంగాధరన్ ఆలోచిస్తుండగా..అధికారులు సడెన్ గా గంగాధరన్ కు కాల్ చేశాడు. ఈ నెంబర్ గల లాటరీకి కోటి రూపాయల బహుమతి వచ్చిందని వెల్లడించారు. వెంటనే తన దగ్గర మిగిలిపోయిన లాటరీ టికట్ల నెంబర్లను..అధికారులు చెప్పిన లాటరీ టికెట్ నెంబర్ తో పోల్చి చూసుకున్నాడు. కోటి రూపాయల లాటరీ టికెట్ నెంబర్ తన దగ్గరే ఉండటంతో..గంగాధరన్ ఆనందానికి అవధుల్లేవు. పంట పండింది..తన కష్టాలన్నీ కడతేరాయనుకున్నాడు. డబ్బు బ్యాంకులో పడే వరకు ఈ తాను కోటి రూపాయలు గెలిచానన్న రహస్యాన్ని ఎవరితో చెప్పలేదు. అదే డ్రాలో తన దగ్గర నుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన మరో ఐదుగురికి ఒక్కో టికెట్ కు రూ. 5000 గెలుచుకున్నారు.
కోటి రూపాయలను బ్యాంకు నుంచి డ్రా చేసుకున్న గంగాధరన్..తన దగ్గర ఉన్న లాటరీ టికెట్ కు కోటి రూపాయలు దక్కించుకోవడం సంతోషంగా ఉందని చెప్పాడు. కండక్టర్ గా పనిచేశానని..ఆ తర్వాత లాటరీ దుకాణాన్ని స్థాపించినట్లు తెలిపారు.