అర్థరాత్రి మెరుపు దాడులు: 108 కేజీల బంగారం దొరికింది

అర్థరాత్రి మెరుపు దాడులు: 108 కేజీల బంగారం దొరికింది

కేరళ రాష్ట్రం.. జీఎస్టీ అధికారులు ప్రత్యేక ఆపరేషన్.. దాని పేరు టవర్ ఆఫ్ గోల్డ్.. 2024, అక్టోబర్ 24వ తేదీ స్టేట్ మొత్తం ఒకేసారి దాడులు చేయాలని ప్లాన్.. అనుకున్నట్లుగానే 700 మంది జీఎస్టీ అధికారుల బృందాలు.. 70 చోట్ల ఒకేసారి దాడి చేయాలని నిర్ణయం.. అనుకున్నట్లుగానే ఆపరేషర్ టవర్ ఆఫ్ గోల్డ్ ప్రారంభం అయ్యింది.. బంగారం షాపులు, హోల్ సేల్ వ్యాపారులు.. ఆభరణాలు తయారు చేసే దుకాణాలు, షోరూంలపై దాడులు చేశారు..

ALSO READ | హైదరాబాద్ సిటీలో రెండు డ్రగ్స్ ముఠాలు అరెస్ట్

10 గంటలపాటు ఆపరేషన్ సాగింది. మైండ్ బ్లోయింగ్. లెక్కల్లో లేని.. లెక్కలో చూపించని 108 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. ఆ 108 కేజీల బంగారానికి లెక్కాపత్రం లేదు. అంతేనా.. ఏకంగా 12 వందల కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల వివరాలు స్పష్టంగా లేదని గుర్తించారు అధికారులు. బంగారం నిల్వలు, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీల్లో 12 వందల కోట్ల రూపాయలకు సరైన పత్రాలు లేవని జీఎస్టీ అధికారులు గుర్తించి.. ఆయా యజమానులకు నోటీసులు ఇచ్చారు. 

జీఎస్టీ అధికారులు ఆపరేషన్ టవర్ ఆఫ్ గోల్డ్ ను ఎంతో పగడ్బందీగా నిర్వహించారు. ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు. దాడుల సమయంలో అధికారులు కస్టమర్లు మాదిరిగా కొన్నిచోట్లకు వెళితే.. మరికొన్ని చోట్లకు పర్యాటకులు, టూరిస్టులు మాదిరిగా వెళ్లారు. 

కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలోనే ఎక్కువగా ఫోకస్ చేసిన జీఎస్టీ అధికారులు.. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కంప్లయింట్స్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. జస్ట్ 10 గంటల తనిఖీల్లోనే 108 కేజీల బంగారం పట్టుబడింది.. 12 వందల కోట్ల విలువైన లావాదేవీలు సక్రమంగా లేవని తేలింది.. ఈ దాడులు రాబోయే రోజుల్లో మరిన్ని కొనసాగుతాయని జీఎస్టీ స్పెషల్ ఆఫీసర్ అబ్రహం వెల్లడించారు.