IPL 2025: ఐపీఎల్ 2025.. కీలక బాధ్యతల కోసం కెవిన్ పీటర్సన్‌ను దించిన ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2025: ఐపీఎల్ 2025.. కీలక బాధ్యతల కోసం కెవిన్ పీటర్సన్‌ను దించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ గా ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఎంపికయ్యాడు. గురువారం (ఫిబ్రవరి 27) ఢిల్లీ యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ జట్టులోకి రావడం పట్ల పీటర్సన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. "ఢిల్లీ జట్టులో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీ జట్టుతో నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ నగరం అంటే నాకు ఎంతో ఇష్టం. 2025లో ఢిల్లీ జట్టు టైటిల్ గెలవడంతో నేను చేయగలిగినదంతా చేస్తాను" అని పీటర్సన్ తన ఎక్స్ ద్వారా తెలిపాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా హేమాంగ్ బదానీ, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మోట్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావులతో కలిసి పని చేయనున్నాడు. 44 ఏళ్ల పీటర్సన్ 2009 నుండి 2016 వరకు ఐపీఎల్ లో ఆడాడు. ఐపీఎల్ ప్రారభం సీజన్ లలో పీటర్సన్ ఢిల్లీ జట్టు తరపున ఆడిన ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పూణే ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 36 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1001 పరుగులు చేశాడు. ఓవరాల్ టీ20 క్రికెట్ విషయానికి వస్తే 200 టీ20 మ్యాచ్‌ల్లో 5,695 పరుగులు చేశాడు. 

ALSO  READ : కోటి రూపాయలు, SUV కారు తీసుకురా..: కట్నం కోసం భార్యకు దీపక్ హుడా వేధింపులు

ఇప్పటివరకు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలవలేదు. 2020లో ఫైనల్‌కు చేరుకోవడం వారి అత్యుత్తమ ప్రదర్శన.2024 ఐపీఎల్ సీజన్ చూసుకుంటే వారు ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు కెప్టెన్ రిషబ్ పంత్‌ను వదులుకున్నారు. అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ , ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకున్నారు. రానున్న సీజన్ లో కేఎల్ రాహుల్, హ్యారీ బ్రూక్, ఫాఫ్ డు ప్లెసిస్, మిచెల్ స్టార్క్‌ లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తుంది.