
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని 57 వ డివిజన్ కు చెందిన 9 మంది అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స పొందిన వారికి సీఎంఆర్ చెక్కులను బుధవారం ఆ డివిజన్ కార్పొరేటర్ రఫీదా బేగంతో కలిసి మేయర్ పూనుకొల్లు నీరజ అందజేశారు.
అనంతరం నగర శివారులోని డంపింగ్ యార్డులో అంతర్గత మెటల్ రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.20 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.