
- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ
మధిర, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్చేయాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ అధికారులకు సూచించారు. మధిర మండలంలోని మోడల్ విలేజ్‌గా ఎంపికైన చిలుకూరు గ్రామాన్ని మంగళవారం ఆమె సందర్శించారు.
చిలుకూరు గ్రామానికి గృహ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 37 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం స్కూల్భవనాలను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి మరీదు కొండలరావు, నాయకులు నిడమానూరు వంశీకృష్ణ, లబ్ధిదారులు ఉన్నారు.