కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

  • ఖమ్మం సీపీ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు :  కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం సీనీ సునీల్ దత్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందేలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆదివారం జిల్లా సరిహద్దులో టాస్క్ ఫోర్స్ బృందాలు మూడు డోన్ కెమెరాలు వినియోగించిన్నట్లు చెప్పారు.

ఇప్పటికే కోడిపందేలను నియంత్రించేందుకు డివిజన్, మండల, గ్రామస్థాయిలో టీమ్​లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డోన్ కెమెరాల ద్వారా కోడి పందేలు, పేకాట శిబిరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.