
- ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్
కారేపల్లి, వెలుగు: అటవీ ప్రాంతంలో పండ్ల చెట్లు పూర్తిగా తగ్గిపోవడం వల్లే కోతులు వ్యవసాయ పంటల వైపు, గ్రామాల్లోకి వస్తున్నాయని, తక్షణమే అడవుల్లో పండ్ల చెట్లు పెంచడమే కోతుల సమస్యకు పరిష్కారమని ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. మండలంలోని తవిసిబోడు గ్రామంలో గురువారం ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు.
పర్యావరణాన్ని పరిరక్షించడం సామాజిక బాధ్యతగా తీసుకొని అటవీ భూములను కాపాడాలని సూచించారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన రైతులకు సౌర శక్తితో నడిచే బోర్ వెల్స్ ఐటీడీఏ ద్వారా అందించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.