వివాహ వేడుకలు జరిగి సంబరంగా ఉండాల్సిన ఓ నిరుపేద ఇంట్లో యువతి మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తిరుపతిరావు, మాధవిల కూతురు దురిశెట్టి భార్గవికి మూడు నెలల క్రితం ఖమ్మం రూరల్ మండలం తనకంపాడు గ్రామానికి చెందిన మహేష్ తో పెళ్లి కుదిరింది. 2023, అక్టోబర్ 26వ తేదీన వీరి పెళ్లి జరగవలసి ఉంది.
పెళ్లికి మూడు రోజులే ఉండడంతో ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బందుమిత్రులకు శుభలేఖలు కూడా పంచేశారు. ఇంతలో భార్గవి అపెండిక్స్ సమస్యతో బాధపడడంతో ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్గవి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాధ ఛాయలు అలుము కున్నాయి. భార్గవి చెల్లెలు గత కొన్ని నెలలు క్రితం మృతి చెందింది. తిరుపతిరావు మాధవిలకు ఇద్దరు ఆడపిల్లల. ఈ ఇద్దరు కూడా మృతి చెందడంతో వారు అనాధలుగా మిగిలారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ALSO READ : నవాజ్ రిటర్న్స్ : పాకిస్తాన్ లో సరికొత్త రాజకీయం మొదలు