రెవెన్యూ మేళాకు 80 ఫిర్యాదులు

రెవెన్యూ మేళాకు 80 ఫిర్యాదులు

ఖమ్మం టౌన్, వెలుగు :  కేఎంసీ పరిధిలో ఇండ్లకు సంబంధించిన ఇంటి పన్ను, వాటర్ పన్నుల మేళాను శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. మేళాకు ఆస్తి పన్ను నమోదు, సవరణ, పంపు పన్నులకు సంబంధించి ప్రజల నుంచి మొత్తం 80 ఫిర్యాదులు అందాయి. మేళా దరఖాస్తులను అసిస్టెంట్ కమిషనర్ షఫీ ఉల్లా, రెవెన్యూ అధికారి శ్రీనివాస్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.  వీటిని వారం రోజుల్లో పరిష్కరిస్తామని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.