
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్) భాధ్యతలు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ హెచ్ . కోక్యా కుటుంబ సభ్యులకు రూ. 8 లక్షల భద్రత ఎక్స్గ్రేషియా చెక్కును శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైనా పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.