బీఆర్ఎస్​కు ముగ్గురు కౌన్సిలర్లు రాజీనామా

ఖానాపూర్, వెలుగు : ఖానాపూర్ మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేరారు. కౌన్సిలర్లు కావలి సంతోష్, జన్నారపు విజయలక్ష్మి, పరిమి లత బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పి బుధవారం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్  సైతం కాంగ్రెస్ లో చేరారు.