అందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వచ్చింది. రామ జన్మభూమి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం తుది దశకు చేరుకుంది. ప్రపంచం అబ్బురపడేలా గుడిని కట్టారు. అలాంటి ఈ దేవస్థానాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. మన దేశం వారే కాకుండా ఇతర దేశస్థులు కూడా రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు.
అలా ఆరాటపడేవారిలో టాంజానియా దేశానికి చెందిన కిలీ పౌల్ కూడా ఉన్నారు. కిలీ పౌల్ సోషల్ మీడియాలో ఇండియన్ సినిమా పాటలు పాడి చాలా ఫేమస్ అయ్యారు. ఆయన కలను గుర్తించిన భారత ప్రభుత్వం కిలీకి ఓ బహుమతిని కూడా అందించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోకి మరో వీడియో వదిలాడు. గోవుల మంద మధ్యలో "రామ్ సియా రామ్" అని రాముని పాటను పాడాడు.
తనకు ఆయోధ్యకు వెళ్లాలని ఎంతో కొరికగా ఉందని ఎవరైనా తనని పిలిస్తే తప్పకుండా వెళ్తానని చెప్పాడు. ఆ రాముడిని ఆశీర్వధం తీసుకోవాలని ఉందని తన పోస్ట్ లో రాశాడు. అతని భక్తి చూసి సోషల్ మీడియా మొత్తం ఆయనకు సలాం కొట్టింది. ఏ దేశం ఏ ఊరు ఏ ప్రాంతం అయినా రాముడిని చూడాలని తహతహలాడుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి రామజన్మభూమి ట్రస్ట్ నిర్వహకులు ఆయనను పిలుస్తారా అనేది వేచి చూడాలి.
కాగా, అయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేత జనవరి 22, 2024లో ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచే భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ నలుమూల నుంచి ఎంతో మంది ప్రముఖులను రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ లిస్టులో రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్, ఉత్తర్ ప్రదేశ్ సీఎం తదిరులను ఆహ్వానించారు.