అమెరికా టెస్లా సైబర్ ట్రక్ పేలుడుకు సంబంధించి సంచలన విషయాలు బయటికొచ్చాయి. సైబర్ ట్రక్ పేలుడుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించారని అమెరికా ఇన్విస్టిగేషన్ టీం నిర్ధారించింది.
AI ద్వారా పేలుడుకు సంబంధించిన అన్ని విషయాలను సెర్చింగ్ చేసినట్లు గుర్తించారు. సైబర్ ట్రక్ పేలుడు వెనక ఏఐ ప్రమేయంపై అమెరికన్ పోలీసులు సీరియస్ ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త ఏడాది 2025 జనవరి 2న అమెరికాలోని లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నెషనల్ హోటల్ వద్ద టెస్లా సైబర్ ట్రప్ పై దాడి జరిగింది. ఈ దాడిచేసేందుకు సహాయంగా నిందితుడు యూఎస్ మాజీ సైనికుడు ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT సాయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అందరికీ అందుబాటులో ఈజీగా యాక్సెస్ చేయగల AI సామర్థ్యం దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ దాడిలో సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
అమెరికన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాస్ వెగాస్ లో టెస్లా సైబర్ ట్రక్ పేలుడు ఘటనలో నిందితుడు మాథ్యూ లివెల్స్ బెర్గర్.. పేలుడుకు ఏయే పదార్థాలు అవసరం, ఎంత మోతాదులో వాడాలి వంటి విషయాలను తెలుసుకునేందుకు చాట్ జీపీటీని వాడినట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది.
ఘటన జరిగిన వారం రోజుుల తర్వాత మంగళవారం అమెరికన్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ సంచలన విషయాలను వెల్లడించింది. మాథ్యూ Livelsberger ChatGPT సెర్చింగ్ డేటాను విశ్లేషించిన ఇన్వెస్టిగేషన్ టీం.. పేలుడు లక్ష్యాలు, కావాల్సిన పదార్థాలు, వేగం వంటి విషయాలతోపాలు పేలుడు పదర్థాల నిషేధంపై వెదికినట్లు నిర్ధారించారు.
పేలుడులో చాట్ జీపీటీ పాత్రపై OpenAI స్పందన
లాస్ వెగాస్ లోని ట్రంప్ హోటల్ ముందు టెస్లా సైబర్ ట్రక్ పేలుడు ఘటనపై Open AI స్పందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. AI వినియోగం నియంత్రణపై చర్యలు చేపట్టాం..విచారణలో పూర్తిగా సహకరిస్తామని Chat GPT తెలిపింది.