
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సోనియా ఆకుల హీరో హీరోయిన్స్‌గా రతన్ రిషి దర్శకత్వంలో జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన చిత్రం ‘కిల్లర్ ఆర్టిస్ట్’. మార్చి 21న సినిమా రిలీజ్. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సంతోష్ మాట్లాడుతూ ‘ఇది ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదు. కచ్చితంగా థియేటర్స్‌లోనే చూడాలి. సక్సెస్‌పై టీమ్ అంతా నమ్మకంగా ఉన్నాం’ అని చెప్పాడు. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవడం ఆనందంగా ఉందని క్రిషేక పటేల్ చెప్పింది.
సోనియా ఆకుల మాట్లాడుతూ ‘ఇందులో కీ రోల్ చేశా. ఈ చిత్రం నాకు నటిగా మంచి గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నా. ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి’ అని చెప్పింది. డైరెక్టర్ రతన్ రిషి మాట్లాడుతూ ‘సెన్సార్ వారి సూచన మేరకు ఈ చిత్రానికి ‘కిల్లర్ ఆర్టిస్ట్’ అని టైటిల్ పెట్టాం. హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథ ఇది. మన సొసైటీలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నా. ప్రేక్షకులకు కొత్త సినిమాటిక్ ఫీల్ కలిగిస్తుంది’ అని అన్నాడు. ఈ సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని నిర్మాత చెప్పారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.