
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్, బోకర్, హిమాయత్‌నగర్ మండలాలకు చెందిన రైతులు సందర్శించారు. అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ఏజెన్సీ(ఆత్మ) ఆధ్వర్యంలో అంకాపూర్లోని పంట పొలాలను, సీడ్ప్రాసెసింగ్యూనిట్లను పరిశీలించారు.
పంటల సాగు విధానాలు, గ్రామం అభివృద్ధి చెందిన తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైతు సంఘం ప్రెసిడెంట్అనంత్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆలూర్నారాయణరెడ్డి, కేకే భాజన్న, ఆత్మ ప్రతినిధులు పాల్గొన్నారు.