Kiran Abbavaraam: దిల్ రూబా టీజర్ రిలీజ్... లవ్ లో సక్సెస్ అయ్యాడా..?

 Kiran Abbavaraam: దిల్ రూబా టీజర్ రిలీజ్... లవ్ లో సక్సెస్ అయ్యాడా..?

గత ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన "క" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరో కిరణ్ అబ్బవరం ఈసారి దిల్ రూబా అంటూ ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసినిమాలో కిరణ్ కి జంటగా ప్రముఖ హీరో రుక్సార్ ధిల్లాన్ నటిస్తుంది. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి తదితరులు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.. 

శుక్రవారం దుల్ రూబా సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్..  ఈ ట్రైలర్ ఆడియన్స్ ని బాగానే అలరిస్తోంది. మొదటగా "మ్యాగీ నా ఫస్ట్ లవ్.." అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత లవ్ లో ఫెయిల్ అయినట్లు చెబుతూనే మళ్ళీ అంజలి తో  ప్రేమలో పడ్డాడని చెబుతూ లవ్ ట్రాక్ ని పరిచయ చేశాడు. ఇక కాలేజ్ లవ్ స్టోరీతోపాటూ ఫైట్ సీక్వెన్స్ ట్రైలర్ పై ఆసక్తిని పెంచాయి. చివరగా ప్రేమ చాల గొప్పది కానీ అది ఇచ్చే బాధ భయంకరంగా ఉంటుంది అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ ఎండ్ అవుతుంది. మొత్తానికి లవ్ & యాక్షన్ బ్యాక్ డ్రాప్ సీక్వెన్స్ లో కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తితోపాటు అంచనాలు కూడా పెంచిందని చెప్పవచ్చు.

 ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు ఏడాదిలో 3 లేదా 4 సినిమాలు చేస్తూ డిజాస్టర్స్ ని మూటగట్టుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కథల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో క్వాలిటీ కంటెంట్ పై దృష్టి సారిస్తున్నాడు.