రాజావారురాణిగారు, SR కళ్యాణ మండపం వంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ పీసీ 524 అనే కొత్త సినిమాతో ముందుకొచ్చాడు.. బాలాజీ సయ్యపురెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో రేచీకటి ఉన్నపోలీస్ కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం. పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీలో ఉన్న కిరణ్ అబ్బవరం పడే ఇబ్బందులు టీజర్ లో చూపించారు. డైలాగులు బాగున్నాయి. దయగల ప్రభువా మదనపల్లి పట్టణ ప్రజలకు ఈ రాత్రి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడు, దేవుడా..ఒక రాత్రి వీళ్లకు కూడా కళ్లు కనబడకుండా చూడు అని కోరుకోవడం కామోడీని పండిస్తున్నాయి. ఈ మూవీలో నువేక్ష, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 25న రిలీజ్ కానుంది.