సింగిల్ గా పోటీ చేస్తాం...కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పారు. మజ్లీస్ పార్టీ చెప్పు చేతల్లో ఉండే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికైనా ఒక్కటవుతాయన్నారు.  బిఆర్ఎస్ తో బీజేపీ  కలిస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ..లబ్దిపొందే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికలు నిర్దేశించిన సమయం ప్రకారమే జరుగుతాయని చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కేసుకు..తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. 
 జమిలి ఎన్నికలంటూ బిఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల గురించి మూడు సంవత్సరాలు చర్చిస్తే అభివృద్ధి ఎప్పుడు చేస్తారు. ఎన్నికలు కాదు శాశ్వతం.. అభివృద్ధి శాశ్వతమని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను తాము ఇంకా ప్రకటించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ నకిలీదని చెప్పారు. 

Also Read :- రైతులకు నష్ట పరిహారం ఇవ్వండి.. అప్పుడే ప్రాజెక్టు పనులు ప్రారంభించండి: డీకే అరుణ

కాంగ్రెస్ సభను బీజేపీ అడ్డుకుంటుందని ప్రచారంలో  వాస్తవం లేదన్నారు కిషన్ రెడ్డి. సోనియా, రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రతీరోజూ సభలు పెట్టుకున్న తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా..ఎవరెన్ని ఆరోపణలు చేసినా..వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఏపీలో జనసేన, టిడిపి  పోత్తుల గురించి  ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందరేశ్వరీ మాట్లాడతారని కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు.  రాజకీయంలో కక్షలు ఉండొద్దని....ఏమి చేసినా సరైన పద్ధతిలోనే చేయాలని అభిప్రాయపడ్డారు.