బీజేపీ ప్రపంచంలోనే బలమైన రాజకీయ పార్టీ : కిషన్ రెడ్డి

 బీజేపీ ప్రపంచంలోనే బలమైన రాజకీయ పార్టీ : కిషన్ రెడ్డి


హైదరాబాద్ : బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అను మానాలు వ్యక్తమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ అన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రపంచంలో నే బలమైన రాజకీయశక్తిగా మారిందన్నారు. 

ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్క రించుకుని నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ పార్టీజెండాను  కిషన్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. అనేకమందిబీజేపీ కార్యకర్తలునక్సలైట్లు, పాకిస్థాన్ ఐఎస్ఐకు వ్యతిరే కంగా పోరాడి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. 'వర్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ మూడు పార్టీలు ఓటు వేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపిం చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ' అని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read:-కృష్ణా ,గోదావరి జలాల్లో మన వాటా మనకు దక్కాల్సిందే..