Good Health : వంటింటి చిట్కాలతో.. ఇంట్లోని దోమలు, ఈగలు, బొద్దింకలను ఇలా తరిమేయొచ్చు..

Good Health : వంటింటి చిట్కాలతో.. ఇంట్లోని దోమలు, ఈగలు, బొద్దింకలను ఇలా తరిమేయొచ్చు..

దోమలు, ఈగలు చూడటానికి చిన్నవే అయినా వాటివల్ల వచ్చే ఇబ్బందులు మాత్రం అన్నీఇన్నీ కావు. ఎక్కడెక్కడో తిరిగొచ్చి అన్నం, కూరలపై వాలుతుంటాయ్. ఈగలు.. గుయ్యి గుయ్యి మంటూ చెవిలో మోత మోగిస్తూ చిరాకుపెడుతుంటాయ్. వీటి గోల చాలదనట్టు ఒళ్లంతా సూది గుచ్చినట్టు దోమల కాట్లు. అవి తెచ్చిపెట్టే జబ్బులు, జ్వరాలు.... వీటి బారినుంచి బయటపడటానికి ఎన్ని రకాల జెట్ కాయిల్స్, లిక్విడ్స్ వాడితే ఇంకో బాధ. వాటి తయారీలో వాడిన రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. రసాయన ఉత్పత్తులకు చెక్ పెట్టి ఈగల్ని, దోమల్ని, ఇతర క్రిమికీటకాల్ని ఇంటి నుంచి పారదోలొచ్చు, అదెలాగంటే..

దోమకు దొరక్కకుండా..

  • దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటేన రసాయనాలకు బదులు సహజసిద్ధమైన ఆయిల్స్ వాడటం బెస్ట్. నిమ్మకాయ చెక్కలో లవంగాలు గుచ్చి, ప్లేట్ లో ఉంచి దోమలు. ఈగలు తిరిగే చోట ఉంచాలి. అలాగే కుండీల్లో బంతిపూల మొక్కలను పెంచి కిటికీలు, తలుపుల దగ్గర పెడితే బంతిపూలలోని రెపెల్లెంట్ గుణాలు దోమలను తరిమేస్తాయి.
  •  తులసి, లవంగం నూనెలను కలిపి ఇంట్లో స్ప్రే చేస్తే దోమలు రావు.  దోమలను తరమడానికి  మస్కిటో మ్యాట్ల అవసరం లేకుండా కమలా పండు తొక్కలను ఎండబెట్టి కాల్చితే వచ్చే పొగకు దోమలు పారిపోతాయ్ . 
  •  రెండు కప్పుల నీటిలో ఐదు చుక్కల లెమన్ ఎసెన్షియల్, పది చుక్కల యూకలిప్టస్ ఆయిల్, ఇరవై చుక్కల సిట్రొనెల్లా ఆయిల్
  • కలిపి ఇంట్లో కిటికీల మూలల్లో, తలుపులపైన, గది లోపల స్ప్రే చేసినా వీటి బెడద నుంచి తప్పించుకోవచ్చు.

ఈగలను ఇలా  తరిమేయండి..

  • తులసి, పుదీనా, లావెండర్ మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఈగలు ఇంటి దరిదాపుల్లోకి రావు. అలాగే బిర్యాని, రోజ్ మేరీ ఆకుల్ని ఓ గిన్నెలో ఉంచి ఈగలు తిరిగే చెత్త బుట్ట దగ్గర, కిటికీల దగ్గర ఉంచినా ఫలితం ఉంటుంది
  •  ఒక కప్పు నీళ్లలో 25 చుక్కల పుదీనా నూనె వేసి స్ప్రేయర్లో నింపి స్పే చేసినా... ఫలితం ఉంటుంది. 
  • ఈగలు ఎక్కువగా ఉన్నచోట కర్పూరం వెలిగిస్తే ఈగలు పోతాయ్. అంతేకాదు ఇంటిని శుభ్రం. చేసేటప్పుడు నీళ్లలో ఒక స్పూన్ పసుపు కలిపి
  • శుభ్రం చేస్తే ఇంట్లోకి ఈగలు రావు. ఇతర క్రిమికీటకాలు కూడా చనిపోతాయ్.

సాలీళ్లకు..

  • రెండు కప్పుల నీళ్లలో 15 చుక్కల పెప్పర్మెంట్ నూనె పోసి, స్ప్రేయర్ లో నింపి గోడల పగుళ్లలో, సీలింగ్, బాత్రూమ్, కిటికీల మూలల్లో స్ప్రే చేస్తే సాలీళ్లు రావు.

చీమలకు..

  • చీమలు ఘాటు వాసనల్ని తట్టుకోలేవు. కాబట్టి దాల్చిన చెక్క, వెల్లుల్లి ముక్కలను చీమలు తిరిగే చోట, కిటికీ పగుళ్ల దగ్గర ఉంచాలి. అయితే చీమలు పూర్తిగా పోయేవరకూ ప్రతి 3 రోజులకోసారి వెల్లుల్లి ముక్కలను మార్చాలి.

బొద్దింకలకు..

  • రెండు కప్పుల నీళ్లలో కప్పు తులసి ఆకులు వేసి మరగబెట్టాలి. ఆ నీళ్లను కిటికీ అంచులు, సింక్ పైప్లు, మూలల్లో స్ప్రే చేస్తే బొద్దింకలు రావు

–వెలుగు,లైఫ్​‌–