
ఖమ్మం టౌన్,వెలుగు : ఖమ్మం సిటీలోని 42 వ డివిజన్ లో ఉన్న మెడినోవా హాస్పిటల్ వెనుక భాగంలో ఉన్న ఖాళీ ప్లేస్ లో మెడికల్ కు సంబంధించిన చెత్తను పడేసినందుకు మంగళవారం కేఎంసీ పర్యవేక్షణ అధికారులు హాస్పిటల్ నిర్వాహకుల కు రూ.8 వేలు ఫైన్ వేశారు.
కాగా, ఖమ్మం సిటీలోని బుర్హాన్ పురం, షాదీఖానా, మామిళ్లగూడెం, శ్రీనివాస్ నగర్, గాంధీ పార్క్, కొలిపాక ఫంక్షన్ హాల్, గొల్లగూడెం, వీడీఓఎస్ కాలనీ, ఇందిరా నగర్ లో ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ కౌంటర్లలో కేటాయించిన వార్డు ఆఫీసర్లు పని తీరును కమిషనర్ ఆయా సెంటర్లలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. కౌంటర్ల వద్ద ఉన్న అర్జీదారులకు సందేహాలను నివృత్తి చేశారు.