Bengaluru: బెంగళూరు బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఇవే.. నెటిజన్స్ పంచుకున్న లిస్ట్..

Bengaluru: బెంగళూరు బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఇవే.. నెటిజన్స్ పంచుకున్న లిస్ట్..

Bengaluru Career Options: బెంగళూరులో ప్రతిరోజూ వేల మంది ఉపాధి అవకాశాల కోసం దేశంలోని వివిధ నగరాల నుంచి వస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఇండియన్ సిలికాన్ వ్యాలీకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యువత అవకాశాల వేటలో వెళుతుంటారు. అయితే నగరంలో మంచి కెరీర్ ఆప్షన్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వస్తున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది ఆదాయం కంటే వేగంగా పెరుగుతున్న ఖర్చులతో వస్తున్న ఆందోళనలకు అద్దం పడుతోంది.

దీంతో ప్రస్తుతం బెంగళూరులో ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ప్రజలకు భారీ రాబడులను అందిస్తున్నాయనే విషయాన్ని ఆరుషీ అనే మహిళ పోస్ట్ చేశారు. ముందుగా అత్యంత ఎక్కువ అద్దెలు కలిగి ఉన్న బెంగళూరు ఇందిరానగర్ ప్రాంతంలో ఇంటి యజమానిగా ఉండటం మంచి రాబడినిస్తుంది. దీని తర్వాత కోరమంగల ఏరియాలో ఇంటి బ్రోకర్ ఉత్తమ కెరీర్ ఆప్షన్ గా చెప్పారు. దీని తర్వాత పెయింటింగ్ జాబ్ చేసేవాళ్లకు మంచి ఆదాయం ఉందన్నారామె.

 

ఇకపోతే ఒకే రూములో 6 మంచాలు వేసి అద్దెలకు ఇస్తున్న పేయింగ్ గెస్ట్ హాస్టర్లకు ఉన్న గిరాకీతో భారీ ఆదాయం వస్తుండగా, అనేక కంపెనీలకు నిలయంగా ఉన్న నగరంలో కో-వర్కింగ్ స్పేస్ లకు ఉన్న డిమాండ్ కారణంగా వాటి యజమానులకు మంచి ఆదాయం వస్తుందని అన్నారు ఆరుషి. ఇదే క్రమంలో బెంగళూరులో రియల్టీ ప్రాజెక్టులు చేస్తున్న బిల్డర్లు, పసుపురంగు వాటర్ ట్యాంకులు నడుపుతున్న సీఈవోలు సూపర్ గెయిన్స్ అందుకుంటున్నట్లు ఎక్స్ పోస్టులో వెల్లడించారు. ఇదే క్రమంలో.. ఐటీ పార్కుల బయట టీ షాపు యజమానులు, జొమాటో డెలివరీ రైడర్లు, పార్కు బయట మెుక్కజొన్న అమ్ముకునే వారు, హెస్ఎస్ఆర్ లేఔట్లో పార్కింగ్ స్పేస్ యజమానులు పెట్టుబడులపై అధిక రాబడులను పొందుతున్నారని నెటిజన్లు సూచించారు.

చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఈ పోస్టుపై స్పందిస్తున్నారు. నగరంలో ఉండే సమస్యలకు ఈ పోస్టు చూపుతోందని అంటున్నారు. మరికొందరు బెంగళూరులోని ప్రతి వీధి మూలన ఉండే ఉడిపి హోటల్ యజమానులు కూడా అదృష్టవంతులేనని అంటున్నారు.