దానం అనేది మనిషి చెయ్యగలిగే గొప్ప పని.. దానం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అవతలి వారికి ఏది అవసరమో దానిని ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా ఇచ్చేది దానం. దానం ఇవ్వడం చాలా గొప్పని, ఆ దానాల్లోనూ మళ్లీ గొప్ప గొప్పవి, మహా గొప్పవి ఉన్నాయని గొప్పగా ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే, మహా అనేది ఎక్కడా స్థిరంగా ఉండదు. ఎక్కడ ఏది గొప్పని భావిస్తే అది అక్కడ మహా గొప్ప దానంగా ప్రాశస్త్యం పొందుతుంది. అయితే అన్ని రకాల దానధర్మాలు నిజంగా సమానమైన శుభ ఫలితాలను ఇస్తాయా? కొన్ని విరాళాలు పెద్ద విరాళాలుగా పరిగణిస్తారు, అయితే కొన్ని వస్తువులను ఎప్పుడూ విరాళంగా ఇవ్వకూడదని సలహా ఇస్తారు..దానధర్మం గ్రహ సంబంధమైన బాధల నుండి ఉపశమనం పొందడమే కాకుండా వివిధ పాపాల నుండి విముక్తులను చేస్తుంది. జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి వివిధ రకాల దానధర్మాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. అయితే కొన్ని వస్తువులను దానం చేయడం చేస్తే శుభం చేకూరకపోగా నష్టం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఏ వస్తువులు దానం చేస్తే మంచిదో.. ఏవి ఇస్తే ఎలాంటి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దానం చేయకూడని వస్తువులు
కుంకుమ: స్త్రీలు ఎప్పుడూ కుంకుమ దానం చేయకూడదు. పెళ్లయిన స్త్రీలు పచ్చిమిర్చి దానం చేస్తే భర్త ప్రేమ తగ్గుతుంది..
వాడిన నూనె: వాడిన నూనెను దానం చేస్తే శని భగవానుడికి కోపం వస్తుందట. శని దేవుడికి కోపం వస్తే ఆ కుటుంబం మొత్తం అతని ఆగ్రహానికి గురికావలసి వస్తుందని పండితులు చెబుతున్నారు..
ప్లాస్టిక్ వస్తువులు: వీటిని దానం చేయడం వల్ల తలపెట్టిన కార్యక్రమాలు అసంపూర్తిగా నిలిచిపోతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. వృత్తి, వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమాజంలో చిన్నపాటి శుభకార్యం జరిగితే కొంతమంది ప్లాస్టిక్ వస్తువులను గిఫ్ట్ పేరుతో ఇస్తుంటారు. అలా ఇచ్చినవి కూడా దానం కిందకే వస్తాయంటున్నారు పండితులు. కాబట్టి ప్లాస్టిక్ సంబంధమైన వస్తువులను ఇతరులకు ఇవ్వకుండా ఉండటమే మంచిదని సూచిస్తు్న్నారు.
చిరిగిన పుస్తకాలు: అన్ని దానాల్లోకల్లా విద్యాదానం గొప్పది. దానం చేసే వస్తువులు మంచిగా, శుభ్రంగా ఉండాలి. చిరగకుండా. మంచిగా ఉన్న పుస్తకాలను, గ్రంధాలను దానం చేస్తే ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. కాని చిరిగిన పుస్తకాలను దానం చేస్తే జ్ఞానం లోపిస్తుందని పండితులు అంటున్నారు. మీరు చదువుకున్న పుస్తకాలు వేరే వారికి ఇచ్చేటప్పుడు అవి ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోండి.
పాడైపోయిన ఆహారం, చిరిగిన, పాత బట్టలు, కత్తులు లేదా ఏదైనా పదునైన వస్తువులు, కత్తెర వంటి వాటిని దానం చేయకూడదు.. వీటిని దానం చేస్తే మనకే తిరిగి నష్టం జరుగుతుంది.. సో ఎప్పుడూ దానం చెయ్యకండి
దానం చేస్తే శుభ ఫలితాలు ఇచ్చే వస్తువులు
దీపదానం: దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాము. వెలిగించే దీపాన్ని దానం చేస్తే దానిని దీప దానం అంటారు. హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పేదరికంతో సహా వివిధ సమస్యల నుండి బయటపడటానికి నదిలో దీపాలను దానం చేయాలి..
భూదానం: ఒక శుభ సందర్భంలో నిస్సహాయ వ్యక్తికి భూమిని దానం చేస్తే, ఆ వ్యక్తి చాలా రెట్లు ఎక్కువ పుణ్యఫలాలను పొందుతాడు. భూమిని దానం చేయడాన్ని శాస్త్రాలలో గొప్ప దానమని పురాణాలు చెబుతున్నాయి.
నీడ దానం : నీడ దానానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ఈ దానం శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీని కోసం ఒక మట్టి కుండలో ఆవాల నూనె వేసి అందులో మీ నీడను చూసి ఆ నూనెను ఎవరికైనా దానం చేయండి.. ఈ దానం వల్ల మన సంపద రెట్టింపు అవుతుంది..
విద్యాదానం: అన్ని రకాల దానధర్మాలలో, విద్యాదానాన్ని మహాదానం అని కూడా అంటారు. నిరుపేద వ్యక్తికి విద్యను అందించడం లేదా వారికి ఉచితంగా బోధించడం ఖచ్చితంగా అభినందనీయం. తత్ఫలితంగా, వ్యక్తి సరస్వతితో సహా అన్ని దేవతల అనుగ్రహన్ని పొందుతాడు..