![అమెరికాలో కోదాడ యువకుడు మృతి](https://static.v6velugu.com/uploads/2021/06/Kodada-young-man-Ravikumar-Siripurapu-dies-in-America_i79gKhISEL.jpg)
సూర్యాపేట జిల్లా: అమెరికాలో సూర్యాపేట జిల్లా కోదాడ యువకుడు మృతి చెందాడు. కోదాడకు చెందిన సిరిపురపు రవికుమార్ (26) అనే యువకుడు యూఎస్‌లో సిగ్నా ఇన్సూరెన్స్‌లో మూడేళ్లుగా పని చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం శనివారం రవికుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్‌కు వెళ్లాడు. బోటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు సమాచారం. తమ కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని, కన్న కొడుకును కడసారి చూసే అవకాశం కల్పించాలని.. పుట్టినూరులోనే అంత్యక్రియలు జరిగేలా చూడాలని యువకుడి తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.