రాష్ట్రగీతం గొప్పగా రావాలనే.. కీరవాణికి అవకాశం ఇచ్చారు : కోదండరాం

రాష్ట్రగీతం గొప్పగా రావాలనే.. కీరవాణికి అవకాశం ఇచ్చారు : కోదండరాం

రాష్ట్ర గీతం గొప్పగా రావాలనే సంగీత దర్శకులు కీరవాణికి అవకాశం ఇచ్చారని ప్రొ. కోదండ రాం అన్నారు. జూన్ 2 రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది.. మేం కోరుకున్న విధంగానే రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు.  జూన్ 2 ఉదయం 11 గంటలకు  రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ అధికారిక కార్యక్రమం ఉంటుందన్నారు.

సాయంత్రం  7 గంటల నుంచి 9 గంటల వరకు సంబురాలు  నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు, వస్తువుల స్టాల్స్  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 

రాష్ట్ర చిహ్నంపై గత సర్కార్ చర్చ జరిపి ఉంటే సమస్య ఉండేది కాదని ప్రొ. కోదండరాం అన్నారు. గత సర్కార్ ఉద్యమ కారులను పట్టించుకోలేదు. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏనాడు ఆవిర్భావ వేడుకలకు  పిలిచిందిలేదన్నారు. 

ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు కోదండరాం. గత సర్కార్ ఉద్యమకారులను పట్టించుకోలేదు.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో మొదటిసారిగా ఉద్యమకారులకు భాగస్వామ్యం దొరికింది..ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారి పేర్లను సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చాం..ఇంకా కొందరు ఉద్యమకారుల పేర్లను రేపు సీఎం కు ఇస్తామన్నారు. ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.