పూనమ్ పాండేకు కోర్టు నోటీసులు

తనకు తానే సర్వేటికల్ క్యాన్సర్ తో చనిపోయినట్లుగా ప్రకటించుకున్న ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే టాపిక్ ఇప్పుడు దుమారం లేపుతోంది. శుక్రవారం పూనమ్ గర్భాశయ క్యాన్సర్ తో చినిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారమెంది. ఇదే విషయాన్ని మీడియాలో కూడా రాశారు. మరుసటి రోజు ఆమె స్వయంగా కెమోరా ముందుకు వచ్చి తాను ఏం చనిపోలేదని చెప్పారు. ఆమెపై నెటిజన్లు,  డాక్టర్లు, కొందరు రాజకీయవేత్తలు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేసిందని మండ్డిపడుతున్నారు. కానీ, ఆమె మాత్రం  గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికే తాను అలా చేశానని చెప్పుకొచ్చారు.

కోల్‌కతాకు చెందిన  అమిత్ రాయ్ ఈ విషయంపై సిరియసై సోమవారం ఆమెకు కోర్టు నోటీసులు పంపించాడు. అంత సీరియస్ ఇష్యూ ను క్రియేట్ చేసినందుకు ఆమె మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ రాయ్ డిమాండ్ చేస్తున్నారు. అనవసరపు గందరగోళాన్ని సృష్టించారని ఆయన అడ్వకేట్ షాయన్ సచిన్ బసు చెబుతున్నారు. మహారాష్ట్రాకు చెందిన ఓ ఎమ్మెల్మే సైతం పూనమ్  బ్రతికుండగానే చనిపోయినట్లు చెప్పుకోవడాన్ని ఖండించి, పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోవాలని అన్న విషయం తెలిసిందే.

Also Read : కేసీఆర్​ సర్కార్​ అవినీతితోనే మేడిగడ్డ కుంగింది: ఉత్తమ్