కోలీవుడ్ హీరో రంగం ఫేమ్ 'జీవా'(Jeeva) ప్రయాణిస్తోన్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. చైన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్‌ను ఢీకొట్టింది. అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ జీవా తనతో పాటు ఉన్న ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.
జీవా తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. జీవా తెలుగులో రంగం సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత డైరెక్టర్ మహి.వి రాఘవ్(Mahi v Raghav) తెరకెక్కించిన యాత్ర2 (Yatra2) లో జగన్ పాత్రలో జీవా నటించి శభాష్ అనిపించుకున్నాడు.