మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్ది రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్ర హోంమంత్రినైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకున్న దాన్నంతా కక్కించి జైల్లో పెట్టిస్తామని అన్నారు. వచ్చే సంవత్సరం కవిత జైల్లోనే బతుకమ్మ ఆడుతుందని చెప్పారు. నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశంలో భాగంగా నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీలో కోమటిరెడ్ది రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ నియోజకవర్గం తాను పుట్టిన గడ్డ అని అన్నారు కోమటిరెడ్ది రాజగోపాల్ రెడ్డి. నకిరేకల్, మునుగోడు తనకు రెండు కళ్ళు లాంటివని చెప్పుకొచ్చారు. సూర్యపేటపై తాను గట్టిగా ఫోకస్ పెడితే జగదీశ్ రెడ్డి ఓడిపోయేవాడని ఏద్దేవా చేశారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందన్నారు రాజగోపాల్ రెడ్డి.
కులం,మతం పేరుతో వచ్చే వాళ్ళని నమ్మవద్దన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పదవుల త్యాగాలు చేశారని తెలిపారు. 20 ఏళ్ల నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తుండని అతని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.