కేసీఆర్ సర్కార్ పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూములను వేలం పెట్టడంపై ట్విట్టర్ వేదికపై మరోసారి స్పందించారాయన. మనదేశంలో భూముల అమ్మకం, అప్పుల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇదే కొనసాగితే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరో శ్రీలంక అవుతుందంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Telangana is the only state in India where government is run either by taking debts or by selling Land. Under KCR’s leadership Telangana would become another Srilanka if this continues.
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) August 12, 2023
ప్రభుత్వ భూముల అమ్మకాలపై గతంలోనూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తూ... ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి’అంటూ కేటీఆర్ ఓ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పాత ఫొటోను జత చేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు.కాగా.. తాజాగా తెలంగాణ సర్కార్ చేపట్టిన కోకాపేట భూముల వేలం రికార్డ్ స్థాయి ధరలు పలికింది. ఎకరానికి రూ. 100 కోట్లు పలికిన సంగతి తెలిసిందే.