తెలంగాణలో గ్రామీణ రోడ్లకు టోల్ ఛార్జీలు వేయం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 తెలంగాణలో గ్రామీణ రోడ్లకు టోల్ ఛార్జీలు వేయం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్ర పరిధిలో నిర్మించే రోడ్లకు టోల్ ఛార్జీలు వేయబోమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  బీఆర్ఎస్ హయాంలో రహాదారులు దారుణంగా ఉన్నాయన్నారు.  రోడ్ల నిర్మాణంలో కమిషన్లు రావనే బీఆర్ఎస్ నిర్మించలేదన్నారు.  బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల గజ్వేల్, సిద్దిపేటలోనే రోడ్లు వేశారని చెప్పారు. సింగరేణి మినరల్ ఫండ్ తో 3సెగ్మెంట్ లోనే రోడ్లు వేసుకున్నారని చెప్పారు. గ్రామం నుంచి మండలం వరకు డబుల్ రోడ్డు వేస్తామన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించే 40 శాతంకూడా తామే చెల్లిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

హరీశ్ రావు మంచి నాయకుడు ఇంతలా అబద్ధాలు ఆడటం బాగలేదన్నారు . ఎన్నికల ముందు బీఆర్ఎస్  ఓఆర్ఆర్ ను అప్పనంగా అమ్మేసిందని ఆరోపించారు. ఓఆర్ఆర్ విలువ లక్ష కోట్లకు పైనే ఉంటుందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి కేవలం 7 వేల 300 కోట్లు కట్టబెట్టారని చెప్పారు. కోకాపేటల భూములు మీ బినామీ సంగతి రాష్ట్రమంతా తెలుసన్నారు. హరీశ్ ను ముందు పెట్టి వెనుక ఇద్దరు, ముగ్గురు నడిపిస్తున్నారని విమర్శించారు కోమటిరెడ్డి

ALSO READ | మా వికారాబాద్ లో రోడ్లు సక్కగ లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు:స్పీకర్