మల్లన్నా శరణు.. శరణు

మల్లన్నా శరణు.. శరణు

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్నం వారం పురస్కరించుకొని సోమవారం పెద్దపట్నం వేసి అగ్ని గుండాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురవెల్లి క్షేత్రం మొత్తం బండారి మయమైంది. ఆలయంలోని తోటబావి దగ్గర భక్తులు ఒకరిపై ఒకరు పసుపు చల్లుకుంటూ, మల్లన్న నామస్మరణ చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. 

అనంతరం అగ్ని గుండాలు దాటుతూ మల్లన్నా శరణు.. శరణు అంటూ వేడుకున్నారు. హైదరాబాద్​జంట నగరాల నుంచి వేలది మంది యాదవులు తరలివచ్చారు. శివ సత్తుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు భక్తులకు కావల్సిన సదుపాయాలను కల్పించారు. - వెలుగు, ఫొటోగ్రాఫర్​