
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో సోమవారం స్వామివారి ముడుపులను విప్పి లెక్కించగా.. రూ.1,65,409 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీకాంత్ తెలిపారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా దీక్షాపరులు స్వామివారికి సమర్పించిన ఇరుముడులు, ముడుపులను లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్ పాల్గొన్నారు.