కోటక్ ​మహీంద్రా బ్యాంక్​ లాభం 4,701 కోట్లు

న్యూఢిల్లీ: కోటక్​ మహీంద్రా బ్యాంక్​ గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​ ఫలితాలను ప్రకటించింది. సంస్థకు ఈసారి రూ.4,701 కోట్ల నికరలాభం వచ్చింది. అంతకుముందు ఏడాది డిసెంబరు క్వార్టర్​లో వచ్చిన లాభం రూ.4,265 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. స్టాండెలోన్ ​లెక్కన ఈ బ్యాంకు నికర లాభం రూ.3,005 కోట్ల నుంచి రూ.3,304 కోట్లకు పెరిగింది.

 మొత్తం ఆదాయం రూ.14,096 కోట్ల నుంచి రూ.16,050 కోట్లకు ఎగిసింది. ఖర్చులు రూ.9,530 కోట్ల నుంచి రూ.10,863 కోట్లకు పెరిగాయి. గ్రాస్​ఎన్​పీఏలు 1.49 శాతం నుంచి 1.50 శాతానికి, ప్రొవిజన్లు రూ.579 కోట్ల నుంచి రూ.794 కోట్లకు చేరాయి.