
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్య తగ్గేదే లేదంటున్నాడు. అతను ఏ బంతిని ఎంత వేగంతో వేస్తాడో చెప్పడం కష్టం. కొన్నిసార్లు సాధారణ వేగంతో వేస్తే.. మరొకొన్ని సార్లు మాత్రమే అతని స్పీడ్ 100 దాటుతుంది. ఐపీఎల్ 2025 సీజన్ లోనూ క్రునాల్ తన బంతులతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. ఇందులో భాగంగా కొన్ని బంతులను విసిరేస్తున్నాడు. ప్రస్తుతం ముంబై వాంఖడేలో ముంబై ఇండియన్స్ తూగో జరుగుతున్న మ్యాచ్ లో ఏకంగా 117 కి. మీ బంతి వేసి ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఇన్నింగ్స్ 10 యువర్ నాలుగో బంతిని కృనాల్ 117 కి.మీ వేగంతో బౌన్సర్ విసిరాడు. ఈ బంతిని పుల్ షాట్ ఆడిన జాక్స్ డీప్ స్క్వేర్ లెగ్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కృనాల్ వేసిన ఈ అనూహ్య బౌన్సర్ కు జాక్స్ దొరికిపోయాడు. 22 పరుగులు చేసి జాక్స్ ఔట్ కావడంతో ముంబై మూడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ముంబై గెలవాలంటే చివరి 10 ఓవర్లలో 138 పరుగులు చేయాలి. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్, హేజల్ వుడ్, కృనాల్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.
Also Read : యష్ దయాళ్ స్నేక్ డెలివరీ
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో విజృంభించింది. కెప్టెన్ పటిదార్(32 బంతుల్లో 64:5 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కు తోడు.. కోహ్లీ(42 బంతుల్లో 67:8 ఫోర్లు,2 సిక్సర్లు), జితేష్ శర్మ(19 బంతుల్లో 40:2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (67) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
🚨 Indian Premier League 2025, MI vs RCB 🚨
— Sporcaster (@Sporcaster) April 7, 2025
Krunal Pandya takes the wicket of Will Jacks#RCBvMI #RCBvsMI #MIvsRCB #MIvRCB #IPL2025 #TATAIPL2025 #TATAIPL #Mumbai #PlayBold #ನಮ್ಮRCB #OneFamily #MumbaiIndians #WillJacks #KrunalPandya #ViratKohli pic.twitter.com/ZRU2OHlltP