- న్యాయం కావాలని రైతులు అడుగుతున్నరు.. వినండి: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: న్యాయం కావాలని రైతులు అడుగుతున్నారని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక్కసారి తెలంగాణకు వచ్చి వారి మాటలు వినాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలతో రైతులకు ఎంత నష్టం జరుగుతు న్నదో చూడాలన్నారు. బ్యాంకులో సూసైడ్ చేసుకున్న ఆదిలాబాద్ రైతు జాదవ్ దేవ్ రావు వీడియోను ఆదివారం ‘ఎక్స్’లో కేటీఆర్ పోస్ట్ చేసి రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు. బ్యాంకులోనే రైతు ఆత్మహత్య చేసుకోవడం గుండెను పిండేస్తున్నదన్నారు. ఇది పట్టపగ లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే ఆ రైతన్న ప్రాణాలు తీసుకున్నాడన్నారు. దీంతో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన భార్య, కుమారుడు అనాథలుగా మిగిలారని చెప్పా రు. కనీసం 40 శాతం రైతులకు కూడా రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పేందుకు ఈ వీడియోనే సాక్ష్యమని పేర్కొన్నారు. మీరు ఇస్తామన్న రైతుభరోసా కూడా బూటకమని అన్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కావాలంటూ తెలంగాణ రైతులు అడుగుతున్నారని, వారి మాటలను ఒక్కసారి వినడానికి రావాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.