పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే

పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే
  • రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదు

  •  మాజీ మంత్రి కేటీఆర్‌ సెటైర్​

హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. త్వరలో 10 చోట్ల ఉప ఎన్నికలు తప్పవని.. డ్రామాలతో ఎక్కువ కాలం రాజకీయం నడవదు అన్నారు. తాము నిర్మాణాలు చేస్తే, కాంగ్రెస్ వాటిని కూల్చుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. 

ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు

రైతు భరోసా కాదు.. ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదు’ అని సెటైర్లు వేశారు.  తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ‘మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివి ప్రదర్శించొద్దు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మాట్లాడారు. ఎమ్మెల్యేలకు కండువా కప్పిన సన్నాసి ఎవరు? గరీబోళ్ల మీద ముఖ్యమంత్రి పగ బట్టాడు. తొమ్మిదిన్నర నెలలో రియల్ ఎస్టేట్ దందా కాంగ్రెస్​చేసింది ఏంటి? దమ్ముంటే నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ల మీద చర్యలు తీసుకో.  ముందు పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మాణాలు కూల్చు. హైడ్రా బాధితులకు అండగా ఉండేందుకు కార్యాచరణ తీసుకుంటాం. ముఖ్యమంత్రి ఆయన సోదరులు, బంధువులు హైదరాబాద్ మీద పడి స్వైర విహారం చేస్తున్నారు. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. రాష్ట్రం మొత్తం కేసీఆర్ రావాలనే రోజు మళ్లీ వస్తది’ అని అన్నారు.