గత BRS ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ఫెయిల్యూర్ లీడర్ అని విమర్శించారు. తాను సీఎం అవుతానని KTR పార్టీని లీడ్ చేసి ఓడిపోయేలా చేశారని ఆరోపించారు. గత సర్కార్ పాలనలో BRS లీడర్లు అక్రమంగా వేలకోట్లు సంపాదించుకున్నారని చెప్పారు వివేక్. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు, మిషన్ భగీరథతో 40 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. పదేళ్లలో BRS చేసిన అవినీతిని బయటపెట్టాలని సీఎం రేవంత్ కి విజ్ఞప్తి చేశారు వివేక్. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల సమస్యలను పట్టించుకోని కేటీఆర్ కేవలం అబద్ధాలకే పరిమితమయ్యాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మూసి ప్రాజెక్టుకు 1500 కోట్లను ప్రభుత్వం నిర్ణయిస్తే కేటీఆర్ లక్ష కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, ఇస్తా అని మాట తప్పిందన్నారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్ ప్రజలకు పనికొచ్చే ప్రయోజనాలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.