మీ సొంత పార్టీ నేతలే.. మిమ్మల్నివేలెత్తి చూపుతున్నారు: కేటీఆర్

మీ సొంత పార్టీ నేతలే.. మిమ్మల్నివేలెత్తి చూపుతున్నారు: కేటీఆర్

పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  తీవ్ర విమర్శలు చేశారు.  మీ సొంత పార్టీ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే.. మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు.  ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా ? అని ప్రశ్నించారు కేటీఆర్.

జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే..  ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని దిగజారుడు రాజకీయాలపై  దుమ్మెత్తి పోశారు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా ? క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు కేటీఆర్.  

ALSO READ | ఐదు అంతస్థుల బిల్డింగ్ కూల్చకుండా సీజ్ చేశారు.. ఎందుకంటే?

మీరు గడప గడపకు వెళ్లి చేర్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయల్సిందేనని పట్టుబడుతున్నారు.  ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై  చర్యలు ఉంటాయా ? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..?  ఫిరాయించిన ఎమ్మెల్యేలనా ? ప్రోత్సహించిన మిమ్మల్నా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్.