TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక థర్డ్ రేట్ క్రిమినల్ అని అన్నారు. TPCC ఛీప్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న శశిథరూర్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని మెచ్చుకున్నారని అన్నారు. కానీ.. పార్లమెంటులో ఆయన తోటి సభ్యుడు.. రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను గాడిద అని అన్నారని చెప్పారు. థర్డ్ రేట్ క్రిమినల్ పార్టీని నడిపిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు.
దీనికి తోడు ఓ పేపర్ లో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్‌ను జత చేసి ట్వీట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఇటీవలే హైదరాబాదులో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. మరోవైపు, ఆయన హైదరాబాదుకు వస్తున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డికి సమాచారం లేదన్నారు.